వ్యభిచార గృహాలపై అమెరికా పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు జరిపిన దాడుల్లో ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విశేషం. ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది.
రష్యాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ గ్రూపునకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను పుతిన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డన మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి.
భారత దేశంలోని మెట్రోపాలిటన్ సిటిల్లో కారును పార్కింగ్ చేయడం చాలా కష్టం.. రోడ్లకు దగ్గరలో బిల్డింగ్ లను కట్టడంతో పాటు అస్సలు ఖాళీ స్థలం అనేది లేకుండా ఆక్రమించడం వల్ల వాహనాల పార్కింగ్ పెద్ద ఇబ్బందిగా మారింది.. దాన్నే కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు.. పెయిడ్ పార్కింగ్ పేరుతో దండుకుంటున్నారు.. ముఖ్యంగా బెంగుళూరు వంటి మహానగరంలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.. కేవలం పార్కింగ్ కోసమే అయితే నెలకు 500 రూపాయలు కట్టొచ్చు. కానీ ఇలా గంటకు రూ.1000…
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు…
విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
Zero Balance : బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త వినిపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇంతకీ ఆర్బీఐ చెప్పిన ఆ గుడ్‌న్యూస్ ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఫైన్ విధించకూడదు బ్యాంకులు.. ఇది బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పించే విషయంగానే చెప్పుకోవాలి.. భారత బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి.. ఈ రోజుల్లో అయితే, బ్యాంకు ఖాతా లేనివారు…
తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సామాన్యుల, విధ్యార్థులు ఈభారాన్ని మోపలేని స్థితిలో నెట్టుకొస్తున్నా అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ నష్టం వస్తుందని మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమమయ్యింది. సగటున 20 నుంచి 30…
ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
తెలంగాణలో విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్ల మెట్రో ప్రయాణికులపై అదనపు భారం పడబోతోందా? విద్యుత్ ఛార్జీల పెంపునకు మెట్రో ప్రయాణాలకు సంబంధం ఏంటి? ఎల్ ఎండ్ టీ ఏమంటోంది? తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని ఇప్పటికే డిస్కంలు ప్రతిపాదించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూనిట్ ఛార్జీ 4 రూపాయల 95 పైసలు అవుతుంది. డిమాండ్ ఛార్జీలు ప్రతి కెవిఏకి 85 రూపాయల పెంపుతో 475 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ ప్రకారం…