Zero Balance : బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త వినిపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇంతకీ ఆర్బీఐ చెప్పిన ఆ గుడ్‌న్యూస్ ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఫైన్ విధించకూడదు బ్యాంకులు.. ఇది బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పించే విషయంగానే చెప్పుకోవాలి.. భారత బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి.. ఈ రోజుల్లో అయితే, బ్యాంకు ఖాతా లేనివారు చాలా తక్కువే.. ఎందుకంటే.. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సొమ్ముల నుంచి.. ఉద్యోగానికి సంబంధించిన జీతం సహా అన్నీ బ్యాంకులకే ముడిపడి ఉంటున్నాయి.. ఇదే సమయంలో కొందరికైతే రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు..
కానీ, బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ కొందరికి సమస్య గానే మారిపోయింది.. బ్యాంక్ ఖాతాలున్న వారిలో వ్యాపారులు, సంస్థలు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు, గృహిణిలు, విద్యార్థులు ఇలా చాలా మందే ఉంటారు.. ఒక్కోసారి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తూ వస్తున్నాయి.. కొన్ని బ్యాంకుల్లో మినీమమ్ బ్యాలెన్స్ వెయ్యి రూపాయలుగా ఉండగా.. మరికొన్నింటిలో రూ.2 వేల నుంచి రూ.3 వేలు.. ఇంకా కొన్ని బ్యాంకుల్లో అయితే రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది చాలా మందికి సమస్యగా మారింది.. ముఖ్యంగా.. ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులు తరచూ కంపెనీలు మారే సందర్భాలు ఉంటాయి.. ఇదే సమయంలో.. ఆ సంస్ధ వారి ఉద్యోగులకు ఓ బ్యాంకులో ఖాతా తెరుస్తూ ఉంటుంది.. ఇలా రెండు, మూడు సంస్థలుమారినవారికి రెండు, మూడు ఖాతాలు ఉంటాయి… ఒక సంస్థలో ఉద్యోగం మానేసిన తర్వాత.. ఆ ఖాతాలో జీతం పడకుండా పోయి.. బ్యాలెన్స్ కూడా లేకుండా పోతే.. చార్జీలు వసూలు చేస్తున్నాయి ఆయా బ్యాంకులు.. మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉంటే.. ఫైన్ల రూపంలో.. క్రమంగా బ్యాంకులో ఉన్న మొత్తం కట్ చేస్తూనే ఉన్నాయి బ్యాంకులు..
అంతేకాదు.. వేరే అవసరాల కోసం డబ్బులు వేసినా.. అందులో నుంచి ఛార్జీలు కట్ చేస్తున్నారు.. దీనిపై అనేక రకాల ఫిర్యాదులు అందడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.. సేవింగ్ అకౌంట్‌లో సున్నా బ్యాలెన్స్ ఉన్నా.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద విధించే చార్జీలను నిలిపివేయాలని బ్యాంకులను కోరింది ఆర్బీఐ.. దీంతో, కొన్ని బ్యాంకులు ఆ దిశగా చర్యలు చేపట్టాయి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.. యాక్సిస్ బ్యాంక్ కూడా ఇదే దారిలో వెళ్తుంది.. మరికొన్ని బ్యాంకులు సైతం ఇదే ఆలోచనలో ఉన్నాయి..