Chandrayaan-3: చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైన స్పేస్ క్రాఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 మిషన్ కీలకమైన మరో ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా కాంప్లీట్ చేసింది. మరోమారు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కిలో మీటర్ల బై 1437 కిలోమీటర్లకు తగ్గించినట్టు ఇస్రో ప్రకటించింది. మూడోసారి చేసిన ఈ ఆపరేషన్‌తో చంద్రుడి ఉపరితలానికి స్పేస్‌క్రాఫ్ట్ మరింత దగ్గరికి వెళ్లినట్లు తెలిపింది. చంద్రుడి కక్ష్యకు సమీపాన ఇంధనాన్ని మండించడం ద్వారా తాజా ఆపరేషన్‌ను పూర్తి చేశామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తిచేసిందన్నారు. ఫలితంగా స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య తగ్గిందని తెలిపారు.
Read Also: Mancherial: ప్రతిపక్షాల స్వ’రక్షణ’ కోసమే మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై ఆరోపణలు: బీఆర్ఎస్
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ఇక, తదుపరి ఆపరేషన్‌ను ఆగస్టు 14, 2023.. ఉదయం 11:30 నుంచి 12:30 మధ్య నిర్వహించనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి మరింతగా చేరువవుతుందని వారు వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు వరుసగా నిర్వహిస్తున్న ఆపరేషన్లు సక్సెస్ అవుతున్నాయి. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు పలు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక కూడా క్రమంగా కక్ష్యను తగ్గించుకుంటూ జాబిల్లి దగ్గరకు వెళ్తుంది.
Read Also: Sajjanar: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. ట్వీట్ చేసిన ఎండీ సజ్జనార్
ఈ నేపథ్యంలో ఆగస్టు 23వ తేదీన ఏం జరుగుతుందోనని అందరు వేచి చూస్తున్నారు. ఎందుకంటే మిషన్ అంతిమ లక్ష్యమైన చంద్రుడి దక్షణ ధృవంపై ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండింగ్ అవుతుంది. ఈ ఘట్టం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా ఈ జాబితాలో ఉన్నాయి. ఇస్రో సాధించబోయే ఈ మైలురాయి అంతరిక్ష అన్వేషణల్లో భారత్ ఎదుగుదలను చాటిచెప్తుంది.
Read Also: PM Modi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ
కాగా చంద్రయాన్-3 మిషన్‌ను జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగే లక్ష్యం దిశగా ఈ మిషన్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ మిషన్‌లో అత్యంత కీలకమైనది.. చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 5న ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించింది. ఇక. ఆగస్టు 23న చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..