భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
Adipurush: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేసినంత విధంగా ఇప్పటివరకు ఏ సినిమాను ట్రోల్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సినిమా రిలీజ్ అయ్యి.. ఓటిటీకి వచ్చేవరకు ఏదో ఒక వివాదం ఆదిపురుష్ ను చుట్టుముడుతూనే ఉంది.
అయితే, చంద్రయాన్-3 రాకెట్ విజయవంతం కావడంతో పలువురు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఈ ప్రయోగం విజయవంతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది.. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం అని ప్రధాని అన్నారు.
భారతదేశం గర్వించేలా చంద్రయాన్-3 రాకెట్ ను నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Chandrayaan-3: భారతదేశం మిషన్ మూన్ తమిళనాడుతో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంది.. లాంచ్ వారి పర్యవేక్షణలో ఉంటుంది.2008లో మొదటి చంద్రుని మిషన్‌తో ప్రారంభమైన చంద్రయాన్ సిరీస్ గురించి ఒక ప్రత్యేకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Chandrayaan-3 Launch: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఓ వైపు చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. దీనికి ముందు ప్రఖ్యాత అంతర్జాతీయ ఇసుక కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ చంద్రయాన్ 3 అద్భుతమైన ఇసుక కళను రూపొందించారు.
Chandrayaan-3: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మూడో చంద్ర మిషన్ అంటే 'చంద్రయాన్-3' ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రుడి వైపు వెళ్లేందుకు వేచి ఉంది.