Chandrayaan-3: చంద్రుడిపై రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతమైంది. విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన ప్రయాణంలో కీలక దిశగా సాగుతోంది. దానికి జత చేసిన థ్రస్టర్లను మండించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నుంచే మొదలు ప్రారంభించారు. తద్వారా ఉపగ్రహాన్ని భూమి నుంచి కక్ష్య దూరం పెంచే ప్రక్రియ మొదలైంది. అంతిమంగా చంద్రయాన్–3ని ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై వీలైనంత సున్నితంగా దించాలన్నది లక్ష్యంగా శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
Read also: Nidhi Agarwal : పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది.
చంద్రయాన్–3ని శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. రోదసిలో దాని ప్రయాణం అద్భుతంగా సాగుతోందని తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్‌ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ శనివారం మీడియాకు తెలిపారు. తొలి దశ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు. చారిత్రాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో తొలి అడుగు విజయవంతమైందని ఉన్నికృష్ణన్ నాయర్ తెలిపారు. లాంచ్ వెహికల్ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షనౌకకు అవసరమైన ప్రారంభ పరిస్థితులను చాలా ఖచ్చితంగా అందించినట్టు తెలిపారు. తొలి అడుగు వందశాతం విజయవంతం కావడంతో తుది అడుగు కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ కాలుమోపుతుంది. ఆ తర్వాతే శాస్త్రవేత్తలకు అసలైన సవాలు ఎదురుకానుంది.
Read also: Cyber Crime: చికెన్ ఆర్డరిచ్చి.. అకౌంట్లో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు
చంద్రయాన్-3లో అన్ని దేశీయంగా తయారైన పరికరాలే. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కేజీలు కాగా, ల్యాండర్ విక్రమ్ బరువు 1,723.89, రోవర్ ప్రజ్ఞాన్ బరువు 26 కేజీలు. చంద్రయాన్ గమ్యాన్ని ఎలా చేరుకుంటుందంటే.. చంద్రుడి సమీపంలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్.. పేలోడ్ ప్రొపల్షన్ నుంచి విడిపోయి ల్యాండ్ అవుతుంది. ఆపై రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కలియదిరుగుతూ పరిశోధనలు ప్రారంభిస్తుంది. లేజర్ కిరణాలను ఉపయోగించి చంద్రయాన్-3 మూన్‌కేక్స్, చంద్రుడి నేల కూర్పు, వాతావరణంపై అధ్యయనం చేస్తుంది. సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ రిసీవర్‌కు పంపుతుంది. అక్కడి నుంచి అది శాస్త్రవేత్తలకు చేరుతుంది. చంద్రుడి కంపనాలపై అధ్యయనం చేసే ప్రజ్ఞాన్ ఫొటోగ్రాఫ్‌లను కూడా పంపుతుంది. ఉపరితలంపై ఓ ముక్కను కరిగించేందుకు, ఈ ప్రక్రియలో విడుదలయ్యే వాయువులను పరిశీలించేందుకు ప్రజ్ఞాన్ లేజర్ కిరణాలను ఉపయోగిస్తుంది.