Chandrayaan-3: చంద్రుడికి అతి దగ్గరలోకి చంద్రయాన్-3 చేరుకుంది. చంద్రుడికి కొద్ది దూరంలోనే ఉంది.. మరికొద్ది రోజుల్లో ఇది సక్సెస్ కానున్నట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రుడి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా నిర్వహించింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చారిత్రాత్మక ఘట్టానికి మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించింది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని నేడు మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య కాగా.. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 kmలకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-3 ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరిందని శాస్ర్తవేత్తలు ప్రకటించారు.
Read also: Gannavaram Politics: యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ..! నెక్ట్స్ ఏంటి..?
చంద్రయాన్-3కి సంబంధించి ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని.. ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారని సైంటిస్టులు చెబుతున్నారు. అది కూడా సజావుగా సాగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి చంద్రయాన్-3 సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. ఇదంతా కరెక్టుగా జరిగితే నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది. ‘చంద్రయాన్-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడినుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు ఇస్రో శాస్ర్తవేత్తలు. ఈ నేపథ్యంలో అన్ని పూర్తయితే ఈ నెల 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై అడుగు పెడుతుందని శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు.