ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ పుల్ గా దూసుకుపోతుంది. అయితే, ఆదివారం చంద్రయాన్-3.. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను వీడియో తీసింది. దీంతో ఆ వీడియోను ఇస్రో ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. శనివారమే చంద్రుని లూనార్ కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ ఆదివారం వీడియో చిత్రీకరించగా అందులో చంద్రుని ఉపరితలం మొత్తం.. నీలి ఆకుపచ్చ రంగులో కనిపించినట్లు తెలిపారు. చందమామ ఉపరితలం పైన లోతైన బిలాలు, పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. దీన్ని చంద్రయాన్-3 చిత్రీకరించిన మొట్టమొదటి వీడియో కావడం విశేషం. ఇప్పటివరకు చంద్రయాన్-3 సజావుగా తన పనిని చేస్తుందని, ఆగష్టు 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Srikalahasti Video Record: శ్రీకాళహస్తిలో దారుణం.. భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ తో చంద్రునికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది. భూ ఉపగ్రహం అయినటువంటి జాబిల్లి దాదాపుగా భూమిని పోలి ఉంటుంది. చంద్రయాన్-3 విజయవంతం అయితే నాసా దాచిన ఎన్నో విషయాలు బయటకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చంద్రుని మీద నీరు ఉందని గతంలోనే మనకి చంద్రయాన్-1 ద్వారా తెలిసింది. ఇప్పుడు చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చంద్రుని పైన ఉన్న వాతావరణంతో పాటుగా చంద్రుని మీద మానవుల మనుగడకు అవకాశం ఉందా? లేదా? అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది.
Read Also: Bipasha Basu: ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించా.. వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు వీడియో!
చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింతగా దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.