Chandrayaan-3 Mission: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.. 2023 జులై 14న LVM3 M4 రాకెట్ ద్వారా గగనతలంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఇప్పటికే మూడింట రెండు వంతుల దూరాన్ని అధిగమించి చంద్రునికి చేరువైందని ఇస్రో ప్రకటించింది.. ఆగస్టు 23వ తేదీన చంద్రునిపైన మూన్ మిషన్ ల్యాండ్ అవుతుందని ఇస్రో పేర్కొంది.
చంద్రునిపై ఉన్న వాతావరణ పరిస్థితులతో పాటు.. అక్కడ ఉన్న రహస్యాలు, ఇతర విషయాలను కనుగొనేందుకు ఇస్రో చేస్తోన్న ప్రయత్నం నేటిది కాదు.. 1999 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశం లో మొదటిసారిగా చంద్రుని పైకి భారత దేశం శాస్త్రీయ యాత్ర చేయాలనీ ఆలోచన చేసారు, అయితే ఈ ఆలోచన రూపుదాల్చింది మాత్రం 2003 ఆగస్టు 15లో అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ చంద్రయాన్ ప్రాజెక్ట్ ని ప్రకటించగా 2008 అక్టోబర్ 22 న పీఎస్ ఎల్వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా చంద్రయాన్-1 ని ప్రయోగించింది.. ఈ ప్రయోగం ద్వారా చంద్ర ఇంపాక్టర్ చంద్రుని పై నీరు ఉందని కనుగొని ఘనవిజయాన్ని సాధించింది. ఇక, తిరిగి మరోసారి 2016 చంద్రయాన్-2ని ప్రయోగించాలి అనుకున్నా.. రష్యా ల్యాండర్ ను అభివృద్ధి చేయలేకపోయేసరికి ఈ యాత్ర వాయిదా వేసి సొంతంగా చంద్రయాన్ ను తయారు చేయాలని భారత్ నిర్ణయించింది. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసి 2019 జులై 22న GSLV MK III రాకెట్ ద్వారా చంద్రయాన్-2ని ప్రయోగించింది. అయితే ఇది చివరి క్షణంలో ల్యాండర్ చంద్రుని పైకి దిగే సమయంలో క్రాఫ్ కావడంతో విఫలం అయ్యింది. దీంతో, మూన్ మిషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో చంద్రయాన్-3కి ప్రయోగించి.. విజయానికి చేరువగా వెళ్తోంది.
కాగా, అంతరిక్షం ఎన్నో అంతు చిక్కని నిగూడ రహస్యాల చీకటి కూపం, ఆ చీకటి కూపంలో ఏముంది? గాలి నీరు లేని ఆ కాంతి రహిత లోకం లో జీవానికి చోటుందా? అవనిని పోలిన గ్రహాలు ఎం అయినా ఉన్నాయా? అనే ఎన్నో ప్రశ్నలు ప్రపంచదేశాలను ఖగోళ రహస్యాలను ఛేదించే దిశగ అడుగులు వేయించాయి, ఇప్పటికి వేపిస్తూనే ఉన్నాయి. అలా అడుగులు వేసే సమయంలో అందరి ద్రుష్టి పడిన ఉపగ్రహం చంద్రుడు, దీనికి కారణం ఇది భూమి యొక్క ఉపగ్రహం, దాదాపు భూమిని పోలి ఉంటుంది, అందుకే చంద్రుని పైన ప్రయోగాలు మొదలైయ్యాయి, నాసా మనుషులని కుడా పంపింది మొట్టమొదటి సరిగా చంద్రుని పైన అడుగుపెట్టిన ఘనత నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి దక్కింది, అపోలో 11 ద్వారా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తో పాటుగా మరో ఇద్దరిని చంద్రునిపైకి పంపిన నాసా మరెందుకో చంద్రునిపైన పరిశోధనలు ఆపేసింది, కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత దేశం చంద్రునిపైన పరిశోధనలు కొనసాగించడమే కాకుండా వీళ్ళ అంతరిక్షం పైన పరిశోధనలు చేసేది అని హేళన చేసినవాళ్ళే మాకు తెలుసు ఇస్రో ఘనవిజయం సాధిస్తుందని భారతీయుల మేధసుని కొనియాడేలా ప్రపంచ దేశాలు భారత దేశం వైపు తలతిప్పి చూసేలా, భారతీయులు తలెత్తుకు తిరిగేలా ఇస్రో(indian space research organisation ) చంద్రుని పైన పరిశోధనలలో విజయం సాధించింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగాలలో చంద్రయాన్ త్రీ ఒకటి. ఇప్పటికే రెండుసార్లు చంద్రునిపైకి ఉపగ్రాలు పంపగా మొదటి సారి విజయాన్ని సాధించి రెండో సారి ఆఖరి క్షణంలో విఫలం అవడంతో చేదు అనుభవాన్ని చవి చూసింది ఇస్రో.