Vyooham Release Date link with Chandrababu: వివాదాస్పద దర్శకుడు ‘రామ్‍గోపాల్ వర్మ’ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు ముందే వివాదాలకు దారితీసిందన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దూమారాన్ని రేపగా ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తయినా రిలీజ్ ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దుచేసింది. దీంతో ఈ తీర్పును డివిజన్ బెంచ్‍లో సవాల్ చేయగా విచారణ జరిపిన బెంచ్.. ఈ చిత్రానికి మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మళ్ళీ సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేషన్ ఇవ్వడంతో వ్యూహం సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ లభించిన్నట్టు అయింది. సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది.
Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్
ఇక తాజాగా ఈ రిలీజ్ డేటుకు చంద్రబాబుకి ఉన్న లింక్ ఇదే అంటూ ఒక ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. CBN లక్కీ నెంబర్ 23 అని అంటూ ఆయన రాసుకొచ్చారు. 1. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLA లు 23 మంది 2. 2019 ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23rd 3. Babu గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23 4. బాబు అరెస్టయిన తేదీ 9-9-23 ….. సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23 5. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 లొ సెప్టెంబర్ 23 rd వరకూ జ్యూడీషియల్ రిమాండ్ ఇచ్చిన సీబీఐ కోర్టు. 6. బాబు ప్రిజన్ నెంబర్ — 7691 …. సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23 7. CBN , NTR దగ్గరనుంచి తను లాక్కున్న పార్టీ కి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టిన రోజు 23rd 8.వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23rd 9.వ్యూహం సినిమా రిలీజ్ 23 rd అని వర్మ పేర్కొన్నారు.
CBN లక్కీ నెంబర్ 23
1.
వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLA లు 23 మంది
2. 2019 ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23rd
3. Babu గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23
4. బాబు అరెస్టయిన తేదీ 9-9-23 ….. సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23
5.…
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2024