నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి .. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు.…
పొత్తులు, టిక్కెట్ కేటాయింపు విషయంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. అనకాపల్లి పార్లమెంట్ లేదా విజయవాడ పశ్చిమలో రెండిట్లో ఓ సీటు తనకు ఇస్తారని.. తాను పోటీ చేస్తానని తెలిపారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానని చెప్పారు. నా నాలుక కోసుకుంటాను కానీ.. చంద్రబాబుని ఎప్పుడు విమర్శించనన్నారు. చంద్రబాబును అలా విమర్శించాల్సిన రోజే వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీలో…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నానని.. తనను గెలిపించండని కోరారు. తనను ఓడించడానికి పురందేశ్వరికి, జీవీఎల్ కు రూ. 1200 కోట్లు ఖర్చు చేయమని మోడీ చెప్పారని తెలిపారు. మరోవైపు.. వైజాగ్ లో వెయ్యి కోట్లు ఖర్చుచేసి తనను ఓడించాలని బొత్స సత్యనారాయణ చూస్తున్నాడని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ తనపై వైజాగ్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు. రెండు నెలల క్రితం…
Vyooham Release Date link with Chandrababu: వివాదాస్పద దర్శకుడు ‘రామ్గోపాల్ వర్మ’ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్కు ముందే వివాదాలకు దారితీసిందన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దూమారాన్ని రేపగా ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తయినా రిలీజ్ ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్…