ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటిస్తున్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉందని.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటిస్తున్న మీరే తమ ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని.. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి…
పార్టీ నేతలతో టీడీపీ అధినేతచంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి బలోపేతానికి…
టీడీపీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు... వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు…
Kurchi Madathapetti Dialouge from Chandrababu goes viral: కుర్చీ మడతపెట్టి అనే ఒక డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ కావడంతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఏకంగా ఒక పాట చేసేసారు. ఇప్పుడు అదే పదంతో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన విద్వాంసం అనే పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న…
ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. నేను చంద్రబాబు లాగా కుర్చీ లాక్కున్న లక్షణం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ లాక్కున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్లో కూర్చున్నానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదన్నారు.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశమై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పేశారు.