ప్రపంచ సుందరుల పోటీ పెడితే ప్రథమ స్ధానం మోడీదేనంటూ సీపీఐ నారాయణ ఆరోపించారు. అమిత్ షా హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి 12 మందిని చంపి నిర్దోషి అయ్యాడు.. ఇక, ప్రధాని మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. అత్యంత క్రిమినల్ గవర్నమెంట్ మన కేంద్రంలో ఉంది అని ఆయన విమర్శించారు.
ఇవాళ్టి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించబోతున్నారు. ఈ రోజు నుంచి 23 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన జరుగనుంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీలోకి చేరికల హోరు కొనసాగుతుంది. తాజాగా.. కొందరు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు నచ్చి అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, వైఎస్ జగన్ నా సవాల్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి..! అని సూచించారు. ఇక, జగన్, చంద్రబాబుని సిద్ధమా అంటున్నాడు.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి…
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి.. చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అని అన్నారు. తన…