తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు.
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు.
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న "తెలుగు జన విజయ కేతనం జెండా" సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని.. అలాగే, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అష్ఠ ద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మీ, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం రెండో రోజు విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ జిల్లాలకు చెందిన ఆశావహులు, నేతలు కలిశారు. టీడీపీకి సంబంధించి టిక్కెట్ల ప్రకటన అనంతరం నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని వారికి సూచిస్తున్నారు. సీటు రాలేదు అంటే.. పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని నేతలకు చెబుతున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధినేత నేతలకు వివరించారు. ఈ క్రమంలో.. భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల…