మంగళవారం రోజు మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. ఇవాళ లేదా రేపు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేస్తారని సమాచారం. ఇవాళ రాత్రికే విజయవాడ చేరుకోనున్నారట గుమ్మనూరు.. ఇక, అల్లూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను కూడా తనతోపాటు విజయవాడకు ఆహ్వానించారట
ఎన్నికలకు 50 రోజుల సమయం మాత్రమే ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) విమర్శించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ చేరారు. హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.