టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే.. తొలి జాబితాలోనే టిక్కెట్ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల…
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం…
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పం కు తీసుకురావడం ఎంతో సంతోషం.. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించల్సిన సందర్భం.. నేను ఎంతో గర్వపడుతున్నాను అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.