Chandrababu: కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు త్యాగాన్ని మరువలేను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఈ ఎన్నికల్లో కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్న ఆయన.. ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పొత్తులతో.. పొత్తుల్లేకుండా కూడా పోటీ చేశాం. పొత్తుల వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయాం అన్నారు. మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లున్నారు. పొత్తుల వల్ల టీడీపీ కోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని.. పెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను నిలబెడుతున్నాం అన్నారు.
పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంచుకున్నాం అని తెలిపారు చంద్రబాబు.. సోషల్ ఇంజనీరింగ్ చేపట్టాం.. బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా చూశాం. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది అన్నారు. విభిన్న వర్గాల్లో ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచనలు కలుగుతున్నాయన్నారు. రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు వస్తారు. రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ మూడు పార్టీల వేసిన పునాది భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.
Also Read
వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్నారు చంద్రబాబు నాయుడు.. రూ. 200, రూ. 500 నోట్లను రద్దు చేసే పరిస్థితి రావాలన్న ఆయన.. పెద్ద నోట్ల రద్దు కావాలనేది నా ఆలోచన.. ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని తెలిపారు. ఇక, వైఎస్ జగన్ లాంటి సీఎంను చూడలేదు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేసేశాడు. జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే. తప్పు చేశారని ఎవరైనా అంటే కేసులు పెట్టేస్తారు అంటూ మండిపడ్డారు. ప్రతి ఒక్కటీ ఫేక్. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేసేశారని ఫేక్ లెటర్ పెట్టేసి ప్రచారం చేశారు. ఇది తాత్కాలిక పొత్తు అని నా పేరుతో ఫేక్ లెటర్లు వదిలారు. పురంధేశ్వరి నా కుటుంబ సభ్యురాలే కావచ్చు.. కానీ, ఆమె ముప్పై ఏళ్లకు పైగా వేరే పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో ఎన్నో తప్పుడు వార్తలు రాశారు. జనసేన మీద.. పవన్ మీద అలాగే తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!