Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. ఈ సారి జనసేన-బీజేపీతో కలిసి బరిలోకి దిగుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే మూడు జాబితాలుగా అభ్యర్థులను ప్రకటించింది.. మరికొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతోంది టీడీపీ. అందులో భాగంగా ఈ రోజు తమ పార్టీ అభ్యర్థులతో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వర్క్‌షాప్‌లో చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ, 13 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. మిగతా స్థానాలపై ఆ పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. తమ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.. అందులో భాగంగా.. ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు.. ఎంపీ అభ్యర్థులతో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.. ప్రచారంలో దూకుడు పెంచిన విషయం విదితమే.. వైనాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.
Read Also: Moscow terror attack: రష్యాకు భారత్ సంఘీభావం.. మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ..