Alapati Rajendra Prasad: అలిగిన ఆలపాటి.. రంగంలోకి అధిష్టానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alapati Rajendra Prasad: సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగనున్న టీడీపీ.. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఈరోజు తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు వెల్లడించింది.. అయితే, టీడీపీ తాజా జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెట్టింది.. ఈ జాబితాలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు చోటు దక్కలేదు.. టీడీపీ తనకు టికెట్ కేటాయించక పోవడంపై ఆలపాటి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Read Also: Farmers Protest: కేంద్ర సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం.. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అంతేకాదు.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెనాలిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు ఆలపాటి.. ఈ సమావేశం అనంతరం తన రాజకీయ భవిష్యత్తు పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఆలపాటి రాజా రాజీనామా చేస్తే.. తెనాలి, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. అయితే, ఆలపాటి రాజా ఆగ్రహంతో ఉన్నారన్న వార్తలు గుప్పమన్న నేపథ్యంలో.. రంగంలోకి దిగింది టీడీపీ అధిష్టానం.. రాజీనామా చేస్తారన్న ప్రచారంతో ఆలపాటి వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, జనసేన los బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పలువురు టీడీపీ నాయకులు.. ఆలపాటి రాజాకు సర్దిచెప్పే పనిలో పడిపోయారు నేతలు.. అయితే, ఆలపాటి వెనక్కి తగ్గుతారా? లేదా? తెనాలి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. కాగా, కూటమి పొత్తుల్లో భాగంగా.. తెలినా సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!