Mandali Buddha Prasad: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు.. అయితే, జనసేన పార్టీలో చేరికకు ముందే మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో నన్ను తప్పకుండా గెలిపిస్తారని నమ్ముతున్నాను అన్నారు.. మీ సహకారంతో ఎమ్మెల్యేగా గెలిస్తే మీ కోసం పనిచేస్తాను.. ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు.. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Tillu squre: 100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!
ఇక, అవనిగడ్డ అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మండలి బుద్ధ ప్రసాద్.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యం అన్నారు.. పిల్లను కూడా ఇక్కడి వారికి ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు.. అసలు ఇవ్వడంలేదని విమర్శించారు.. అయితే, జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్టు, జనసేన పార్టీలో చేరుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. కాగా, టీడీపీలో అవనిగడ్డ టికెట్ బుద్ధప్రసాద్‌కు దక్కకపోవడం ఒకటైతే.. పొత్తుల్లో భాగంగా.. జనసేనకు ఆ సీటును కేటాయించింది టీడీపీ.. ఈ నేపథ్యంలో.. మండలి బుద్ధ ప్రసాద్.. జనసేనలో చేరి.. అదే స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.