బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు అని పేర్కొన్నారు. ఫ్లైట్స్ లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజక వర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు.. సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్డులు ఉన్నాయి కూడా తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గ సీటు అమ్మేసుకున్నారు.. పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నా విన్నపం ఒకటే కమలం గుర్తుపై ఓటు వేసి మీ మాత్రం ఓటు వేస్ట్ చేసుకోకండి అని కేశినేని నాని పిలుపునిచ్చారు.
Read Also: Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్ రికార్డు బ్రేక్!
రెండు సార్లు రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి అప్పుడే ఏం అభివృద్ధి చేయనివాడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటూ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. పశ్చిమలో బీసీకి టికెట్ ఇస్తాను అని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. విజయవాడ పశ్చిమ సీటు మైనారిటీకి ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. పోతిన మహేష్ ని 10 సంవత్సరాలు వాడుకొని వదిలేసినా వ్యక్తి పవన్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిఫ్ ఒక సామాన్యుడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి.. అసిఫ్ ని మంచి మెజారిటీతో గెలిపించుకుంటారు అని కేశినేని నాని వెల్లడించారు.