Mandali Buddha Prasad: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి.. కృష్ణా జిల్లా అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు జనసేన పార్టీలో చేరనున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు పూర్తి అయినట్లు సమాచారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి తరపున జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ బరిలోకి దిగుతారంటూ స్థానికంగా ప్రచారం సాగుతోంది.. అయితే, 1999, 2004, 2014 సార్వత్రిక ఎన్నికల్లో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు బుద్ధ ప్రసాద్..
Read Also: West Bengal: బెంగాల్లో తుఫాను విధ్వంసం.. నలుగురి మృతి, 100 మందికి గాయాలు
కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించింది టీటీడీ.. దీంతో, ఈ సారి మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు.. ఇక, గత కొన్ని రోజులగా టీడీపీకి ఈ టికెట్ కేటాయించి బుద్ధ ప్రసాద్ ని బరిలోకి దింపాలంటూ ఆయన వర్గం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది.. కొందరు ఆయనకు మద్దతుగా టీడీపీకి రాజీనామాలు కూడా చేశారు. అయితే, అవనిగడ్డ సీటును ఇప్పటి వరకు పెండింగ్‌లోనే పెట్టారు పవన్ కల్యాణ్.. జనసేనలో బుద్ధ ప్రసాద్ చేరిన తర్వాత అభ్యర్ధిగా రేపు లేదా ఎల్లుండి.. ఆయనే పేరునే ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.. మరోవైపు.. టీడీపీలో ఉన్న బుద్ధ ప్రసాద్ కు పొత్తులో టికెట్ దక్కకపోవడంతో పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.