ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం... పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.