KGF 3: కేజీఎఫ్-3 ఇక్కడే .. కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Comments on KGF 3 : కేజీఎఫ్ -1, కేజీఎఫ్-2 సినిమాలను ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రచారం లో భాగంగా ఇవాళ చంద్రబాబు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ…. ఈ ఎండ కారణంగా కలుగుతున్న మంట కంటే, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న మంట ఎక్కువగా ఉందనన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పారు, ఎప్పుడో కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 అని విన్నానని అన్నారు. నా నియోజకవర్గం కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉంటుంది, కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. కానీ కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ వెళ్లాలి. అదే కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలన్నారు.
Vishal: ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పను కానీ!!.. హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
Also Read
కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్స్, కాకాణీ… కేజీఎఫ్ ను సృష్టించుకున్నావు… అందులోనే నిన్ను పాతిపెడతా, అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు… ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూరుకుపోయాడంటే… మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదని అన్నారు. శాశ్వతంగా గోతిలోనే ఉంటాడని, తవ్విన గోతులే, కొట్టిన కొండలే, దోచిన ఈ సహజ వనరులే రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయని అన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మూడో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ ఎప్పుడొస్తుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా జరుపుకోలేదు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ తో పాటు యష్ వేరు వేరు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!