చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. అతిరథ మహారధులు వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా.. అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు…
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ బీ- ఫామ్ అందుకున్నారు.
రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను.. రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. ఇంకొన్ని అంశాలు మిగిలి పోయాయి కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు ఓపెన్…
పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని,…
ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉదయమే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు.