CM YS Jagan: సూటిగా అడుగుతున్నా.. చెప్పవయ్య బాబు.. చెప్పు.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అనకాపల్లి జిల్లా చింతలపాలెం నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సిద్ధం సభను చూస్తే ప్రభంజనం అంటే ఏంతో ఏంటో అర్థం అవుతుంది.. ప్రజాప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన ప్రజా సైన్యం ఇక్కడ కనిపిస్తోందన్నారు. ఈ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ ను నిర్దేషించేందుకు జరుగుతున్నాయి.. ప్రతీ వర్గాన్ని మోసం చేసి.. .ఎన్నికల వచ్చేసరికి మరోసారి భ్రమలు కల్పించడానికి వస్తున్న మోసగాళ్లను ఓడించడానికి సిద్ధం కావాలని సూచించారు. జగన్ ను ఓడించాలని కూటమి… జనాన్ని గెలిపించాలని మనం పోరాడుతున్నాం.. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు జరగబోతున్నాయి.. సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరుగు పెడుతున్నాయన్నారు. కడుపు మంటతో నా మీద రాళ్లేయమని చెబుతున్నాడు… జగన్ ను కొట్టడానికి, హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూటమికి అధికారం కావాలి అంటూ అంటూ మండిపడ్డారు.
జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం… పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలతో బాణాలు, రాళ్లు పట్టుకుని నా చుట్టూ మోహరించి వున్నారు.. దేవుడు, జనమే జగన్ కు తోడుగా ఉన్నారని తెలిపారు. ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కోవడం కోసం నక్కలు ఎగబడుతున్నాయి.. నేను బచ్చాను అయితే.. నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన నిన్నేమీ అనాలి చంద్రబాబు..? అంటూ నిలదీశారు. నేను బచ్చా అయితే జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమం 14ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..? అంటూ నిలదీశారు.
ఇక, మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు.. ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు సీఎం జగన్.. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలే కాదు.. ఇవి మన పేదలను, ఇవి మన రైతులను, ఇవి పిల్లలను, ఇవి అక్క చెల్లెమ్మలను, ఇవి మన అవ్వాతాతలను, ఇవి పేద సామాజిక వర్గాలన భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలుగా పేర్కొన్న ఆయన.. మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం.. కుట్రలతో మోసాలతో వారు వస్తున్న ఈ ఎన్నికలకు మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. మీ బిడ్డ ఒక్కడి మీద వేయడానికి బాణాలు పట్టుకుని చుట్టూ ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని ఉన్నారు.. వీరందరీ మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు.. మరి మీ జగన్‌కు తోడెవరు..? జగన్‌కు తోడు.. ఆ దేవుడు, ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న అక్క చెల్లెమ్మలు అని గర్వంగా చెబుతున్నాను అన్నారు.