నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్‌లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం…
ఆత్మకూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఎవరూ ఆనందంగా లేరని.. కేవలం మాత్రమే జగన్, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బాగుపడ్డారన్నారు.
చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.
వన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి వ్యక్తి గత గొడవలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ రోజు ఎన్టీవీలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు సంధించి ప్రశ్నలకు మాజీ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు.
చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అయితే, చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే.. కానీ, ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పానన్నారు. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పడం ద్వారా కొంత మందిని అయిన దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.