ఏపీకి డ్రైవర్ తానేనని.. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల పాలైన ప్రజల కోసమే బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా వస్తున్నట్లు తెలిపారు. పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చరన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మ్యానిఫెస్టోతో టీడీపీ సూపర్ సిక్స్ లతో జనాల రాత మారుతుందన్నారు. రాజాంలో పూర్వ వైభవం రావాలన్నది తన చివరి…
శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. ఇక, ఆయన బాటలో ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా అడుగులు వేశారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
చంద్రబాబు నిన్న గాజువాకలో మీటింగ్ పెట్టినపుడు స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయివేటికరణకు వ్యతిరేకమా, అనుకూలమా? అని మంత్రి బొత్స అన్నారు. ద్వంద వైఖరి ని ఖండిస్తున్నామని, మా పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ ప్రయివేటి కరణకు వ్యతిరేకమన్నారు. ప్రజాస్వామ్యం లో, ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమం లు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లోని బి.ఎన్ రెడ్డి నగర్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వలసవాసులు అపూర్వ స్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య యువత, ఆడపడుచులు బి.ఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకర్ల సురేష్ కు మేమున్నాము మీకు అని ధైర్యాన్ని నింపి మా అందరి ఓటు సైకిల్ గుర్తు మీద మా పవిత్రమైన ఓటు…
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చిన అజెండా ఒకటేనని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పరిరక్షణ అలాంటి పాలన రావాలంటే సైకో పోవాలి.. కూటమి గెలవాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి అని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు. ఈ రాష్ట్రంలో…
నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.
ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.
అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్ ఇచ్చా.. రాజకీయంగా మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో మాట్లాడిన ఇక్కడ చేనేత మహిళకు టికెట్ ఇచ్చాను అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఏపీ: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా…