ఎన్నికల వేళ నేతలు ప్రచార జోరును పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయంలో మార్పు వస్తోంది.. మంచి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు.
తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
మణిపూర్లో హింసాత్మక ఘటనలు.. ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ మణిపూర్ ఔటర్ లోక్సభ స్థానంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ను రద్దు చేసినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత ఇక్కడ ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తాజా ఓటింగ్ జరగనుంది. ఈ ఆరు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇది చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా…
నేడు కస్గంజ్లో అమిత్ షా, బరేలీలో సీఎం యోగి పర్యటన.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం కాన్పూర్లోని తిలక్ నగర్ ప్రాంతంలో బీజేపీ సంస్థాగత సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై…
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం…
ఆత్మకూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఎవరూ ఆనందంగా లేరని.. కేవలం మాత్రమే జగన్, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బాగుపడ్డారన్నారు.
చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.
వన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి వ్యక్తి గత గొడవలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ రోజు ఎన్టీవీలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు సంధించి ప్రశ్నలకు మాజీ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు.