Piyush Goyal: చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తావన వచ్చిందట.. ఇక, పెన్షన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ కి వివరించారు చంద్రబాబు నాయుడు.. మరోవైపు వచ్చే (మే నెల) నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై కూడా చర్చించారట.. అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. తెలుగు నేలకు నేను రావడం గర్వంగా భావిస్తున్నాను.. గత ఐదేళ్ళుగా ఏపీ చాలా వెనుకబడింది.. రైతులను ఏపీలో పూర్తిగా పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు.
Read Also: Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
ఇక, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా ఏపీ మారిందని విమర్శించారు పీయూష్ గోయల్.. కేంద్రం ఇచ్చిన గృహాలు అన్నీ ప్రజలకు అందలేదు.. పోలవరం ప్రాజెక్టు 15వేల కోట్లు ఇచ్చింది కేంద్రం అని గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినా కూడా భూమిని రాష్ట్రం మాకు ఇవ్వలేదన్నారు. మరోవైపు.. భారతదేశం జీడీపీలో 5వ స్ధానానికి చేరుకున్నాం.. 2014, 2019 లలో చేసిన ఏ హామీలను ప్రధాని నరేంద్ర మోడీ మర్చిపోలేదు.. రామమందిర నిర్మాణం భారతీయులందరికీ గర్వకారణంగా చెప్పుకొచ్చారు. ఇక, 2047 నాటికి వంద సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనం పండుగలా చేసుకోవాలని కోరారు. ప్రతీ ఇంటికీ నీటి సదుపాయం ఉండేలా కేంద్రం పని చేసింది.. ప్రతీ భారతీయుడి భవితవ్యం కోసం కేంద్రం పని చేస్తోంది.. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం అత్యున్నత విధానాలు తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు సీఎం అవుతారు.. ఏపీ నుంచీ 25 ఎంపీలు మా కూటమికి వస్తారన్న ఆయన.. స్పెషల్ కేటగరీ స్టేటస్ కంటే ఎక్కువ లబ్ధి ఏపీకి జరిగిందన్నారు.. బీజేపీ ముస్లిం రిజర్వేషన్ ల విషయంలో ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ రిజర్వేషన్లు మాత్రమే రిజర్వేషన్లు మాత్రమే. రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే మాకు ఇప్పుడే అవకాశం ఉంది.. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోంది గాంధీ కుటుంబం కోసం అంటూ ఆరోపించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.