ఏపీలో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు…
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక…
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పేదల వైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి జగన్కు నష్టం చేయాలని చూస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్…
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే…
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో స్ధానిక నాయకులతో కలిసి గన్నవరం నియోజకవర్గం జనసేన, బీజేపీ బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో.. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. అక్కడ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. మరోవైపు.. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తేదీన ఏపీలో, ఢిల్లీలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వికసిత ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్ సాధ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం…
అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వికసిత ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర…
కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్‌లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో…