కాకినాడ గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారు అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. "జగన్ బినామీ ఇక్కడే ఉన్నాడు.
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ అభిమతమని.. అందుకే జట్టు కట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 వరకు భారత్‌ను నెంబర్ వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పమని తెలిపారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగాడని.. ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశాడు.. చెట్లు నరికేశాడని ఆరోపించారు.
ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా…
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు.
ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.