ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్‌లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని.. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడని ఆయన ఆరోపించారు.
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రజలందరు సిద్ధంగా ఉండాలని కోరారు. తనది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పోటీ చేసిన గొప్ప…
ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈఓ ముకేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ బృందం కలిసింది. పాణ్యం, అనకాపల్లి సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈసీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో దుర్భాషలాడిన నేతలపై 48 గంటలు నిషేధం విధించిందని…
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోడీ తన గెలుపుకు మద్దతుగా తలపై…