ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆ బిల్లు వచ్చినప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, DBT పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదును లబ్దిదారులకు…
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.