రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అభ్యర్థి జయచంద్రా రెడ్డిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
ఇంకా అమలులోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ... తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడన్న ఆయన.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా ..? అని సవాల్ విసిరారు.
ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు.
కాకినాడ గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారు అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. "జగన్ బినామీ ఇక్కడే ఉన్నాడు.
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ అభిమతమని.. అందుకే జట్టు కట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 వరకు భారత్ను నెంబర్ వన్గా చేయాలనేది మోడీ సంకల్పమని తెలిపారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగాడని.. ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశాడు.. చెట్లు నరికేశాడని ఆరోపించారు.
ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా…