చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఏపీకి పట్టిన కరోనా కంటే భయంకర వైరస్ లు అని మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. వార్డు మెంబరుగా కూడా గెలవని లోకేష్ ట్వీట్లకు ఏం సమాధానం చెబుతామని మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివర్ అంశాలను కేంద్రం పర్యవేక్షిస్తోందని..వైజాగ్ లో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటే 100 మెట్రిక్ టన్నులు మనకు ఇచ్చి మిగిలింది మహారాష్ట్ర కు ఇవ్వమన్నారని తెలిపారు. ఏపీని..ఒరిస్సా నుంచి…
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉంది. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ పోలింగ్ జరుగలేదు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తిరుపతిలో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు కుట్ర పూరితంగా ఆలోచించటానికి అలవాటు పడ్డాడు. దొంగ ఓట్లు వేసేటట్లు అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు వేయరు చంద్రబాబు…
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని వేయించుకున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని తండ్రి కొడుకులు వేయించుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీల్లో ఫోటోలు కనిపించక…
తిరుపతి ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఈ ఉపఎన్నికలో 25 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో యరపీ ఎన్నికల అధికారికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు చేసిందని నిఘా పెంచాలని కోరారు. రిగ్గింగ్, హింస ను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు.. అదనపు బలగాలను దించాలని కోరారు. నకిలీ ఓట్లు పోల్ కాకుండా…
నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఫేస్ బుక్ ఖాతా జయహో చంద్రబాబు అనే పేరుతో ఉందని , ఆ ఖాతా నుంచి సోషల్ మీడియాలో దళిత ఎమ్యెల్యేలు అయిన తన ఫోటో, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ , సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంల ఫోటోలు పెట్టి, కింద భాగంలో మంత్రులు పెద్ది రెడ్డి…
టిడిపి పార్టీ పై విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కుల పిచ్చతో చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని కోల్పోయాడని విజయసాయిరెడ్డి. “కుల పిచ్చితో అడ్డమైన అరాచకాలు చేసి చంద్రబాబు తన రాజకీయ పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. మతం పేరుతో విభజన తీసుకురావాలని ఆరాటపడుతున్న వాళ్ల గతీ అంతే. పోలింగుకు రెండ్రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు? మీకంటే నిఖార్సైన హిందువు ఆయన. ” అంటూ తెలిపారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్…
ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోయేలా కనిపిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. టీడీపీకి ఆ పార్టీ నేతలే భస్మాసురుల్లా మారారని…వారి చేష్టలతో అక్కడ ఎవరూ ఉండలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఒకరిద్దరు పోతే…మిగిలిన వాళ్ళు బీజేపీలోకి ..ఇతర పార్టీల్లోకి పోయేలా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి అని తాము అనుకుంటున్నా కానీ…టీడీపీకి ఆ హోదా కూడా దక్కేలా లేదని.. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవడానికి కూడా టీడీపీకి శక్తి ఉండదన్నారు…
వకీల్‌సాబ్‌కు గట్టిగానే వకాలత్ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ప్రయణిస్తున్న తర్వాత చంద్రబాబు ఎంచుకున్న ఈ లైన్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరని భావించాలా? తిరుపతి ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తున్న కొత్త నేపథ్య సంగీతాన్ని ఎలా చూడాలి? భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పవన్‌పై కర్చీఫ్ వేశారా? వకీల్‌సాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో చంద్రబాబు స్పందన ఇది. వాస్తవానికి తీవ్ర దుమారం రేపిన ఈ…
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్‌షోలో బాబు వాహనంపైకి అగంతకులు రాళ్లు రువ్వారు. దాంతో, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. రాళ్ల దాడిపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు క్రిష్టాపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపధ్యంలో సీఎం జగన్ డౌన్‌డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. జడ్ ప్లస్…