చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఆరోపణలు చేస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడ అయినా రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ప్రజలకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడా గతంలో టీడీపీ వైఫల్యాలను ప్రస్తావించటం లేదు. ఈ సంక్షోభంలో ఏ రకంగా ప్రజలను ఆదుకోవాలి అనే నిరంతరం ఆలోచిస్తున్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వం భాగం. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా మనుషులే. అందరూ కలిసి కట్టుగా ధైర్యంగా ముందుకు వచ్చి పని చేయాల్సిన సమయం ఇది. కానీ చంద్రబాబు అందరిలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. విలన్ లలో కూడా బెస్ట్ విలన్ లు ఉంటారు. కానీ చంద్రబాబు వరస్ట్ విలన్ అని అన్నారు.