తిరుపతి ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఈ ఉపఎన్నికలో 25 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో యరపీ ఎన్నికల అధికారికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు చేసిందని నిఘా పెంచాలని కోరారు. రిగ్గింగ్, హింస ను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు.. అదనపు బలగాలను దించాలని కోరారు. నకిలీ ఓట్లు పోల్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటు చంద్రబాబు లేఖ రాయడం పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఓటమి భయంతో ఇలా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇది ఇలా ఉండగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు. మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు గ్రామస్థులు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరూ రాక బోసిపోయింది ఊరందూరు పోలింగ్ స్టేషన్. ఇప్పటికి ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది.