టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ లీడర్ ఉమా మహేశ్వర్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దొంగల బడిలో ట్రెయినింగ్ తీసుకున్నవాళ్లంతా దొరికిపోతున్నారని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. “బాబు దొంగల బడిలో ట్రెయినింగ్ తీసుకున్నవాళ్లంతా దొరికిపోతున్నారు. 1) దోచుకోవాలి గాని ఎవిడెన్స్ వదలొద్దు. 2) అబద్దాలు వరదలా పారించాలి. తర్వాత బుకాయించాలి. 3) మార్ఫింగ్ వీడియోలు చూపాలి. నాకే పాపం తెలియదనాలి. ఉమా అడ్డంగా బుక్కయ్యాడు. బాబు ‘మ్యానేజ్’ చేయలేక చస్తున్నాడు.” అంటూ చురలకు అంటించారు విజయసాయిరెడ్డి. ఇక అంతకుముందు ట్వీట్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. “ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశానికే ఊపిరి పోస్తోంది. కోవిడ్ తీవ్ర రూపందాల్చి వేల మంది ప్రాణాలు హరిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ అందిస్తూ కోవిడ్ బాధితుల పాలిట ప్రాణదాతగా మారింది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.