MLA Balakrishna: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇక, బస్సులోకి ఎక్కిన తర్వాత బాలకృష్ణ ఓ చిన్న పిల్లాడితో కాసేపు ముచ్చటించారు.
Anam Ramanarayana Reddy: ఏపీ సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. బ్లాక్-2లోని తన ఛాంబర్లో పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు.
మేయర్ వీడియోస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) మేయర్ గద్వాల్ విజలక్ష్మి, తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కించపరిచేలా వీడియోను రూపొందించి, ప్రచారం చేసినందుకు గాను ఓ ఫోటోగ్రాఫర్‌ను ఆగస్టు 10వ తేదీ శనివారం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల చామకూరి లక్ష్మణ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను…
హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు..
Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.
Amaravati: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.