Miss Universe India: మిస్ యూనివర్స్- ఇండియాకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరపున అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఇవాళ (శుక్రవారం) సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల పరిధిలోని ఎంకే పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు ఏపీ తరపున ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా జయరాం పాల్గొనబోతున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్- ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.