Minister Narayana: రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు అని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు.. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు.. అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం.. రైతు కూలీలకూ పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయం.. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నామన్నారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకే మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించాం.. సోమ, మంగళవారాల్లో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాం.. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!
ఇక, సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులని నియమించుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లను తీసుకోవడానికి అథార్టీ నిర్ణయించింది.. 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం.. గత ప్రభుత్వం 6993.20 చదరపు కిలో మీటర్లకు కుదించింది.. దీన్ని తిరిగి పాత విధానం మేరకు పరిధి ఉండాలని అథార్టీలో నిర్ణయించాం.. కోర్ క్యాపిటల్ ఏరియాను తిరిగి 217 చదరపు కిలోమీటర్ల ఉంచేలా నిర్ణయం తీసుకున్నాం.. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది అని నారాయణ ఆరోపించారు.
Read Also: Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
అలాగే, సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ చెప్పుకొచ్చారు. కరకట్ట రోడ్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించాం.. కరకట్ట నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నాం.. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే.. అంత వరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిలోని ఈ-5,11,13,15 రోడ్లను ఎన్ హెచ్ కు కలిపేలా చర్యలు తీసుకుంటాం.. అమరావతికి ఈఆర్ఆర్, ఓఆర్ఆర్లు ఉంటాయి.. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు.. ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణమే చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు.