ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు…
ఆ మాజీ మంత్రి రాజకీయ దోబూచులాడుతున్నారు. పార్టీలోనే ఉంటానంటారు. హైకమాండ్ పిలిస్తే మాత్రం పలకరు. ఉనికి కోసమే అనుకుంటే.. వ్యూహాలను తెరపైకి తెస్తారు. రెండున్నరేళ్లుగా ఇదే ఆయన స్టయిల్. ఇప్పుడైనా క్లారిటీకి వస్తున్నారా అంటే వెయింట్ అండ్ సీ అంటున్నారు. ఇంతగా కన్ఫ్యూజన్‌లో ఉన్న ఆ నేత ఎవరు? టీడీపీ కోసం బహిరంగ వేదికలపైకి వచ్చిన సందర్భం లేదుమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే. సైకిల్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేత. అధికారంలో…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అలవాటుగా మారి మాటల దాడి చేస్తున్నారు. ఏదో విధంగా , ఏవేవో కధనాలు రాసి వాటి పైన ప్రతి పక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నారు. ప్రజల్లో రాజకీయ లబ్ది పొందడం కోసమే దిశగా ప్రవరిస్తున్నారు. ఎన్టీపీసీకి …ప్రభుత్వానికి కొంత గేప్ వచ్చింది. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయి. లేదని నేను చెప్పలేదన్నారు బొత్స. సమస్య అయిపోయిన తరవాత…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్‌లో…
సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్.. మూడేళ్లు పూర్తి కాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్ గా వున్న ఏపీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం,…
పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5…
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోంది. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికం.కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర…
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గుంటూరు పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించనున్నారు. ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో చంద్రబాబు సమావేశం జరగనుంది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు 12 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనులో సమావేశం జరుగుతుంది. గత రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తూ.. కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు, తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని…