టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అలవాటుగా మారి మాటల దాడి చేస్తున్నారు. ఏదో విధంగా , ఏవేవో కధనాలు రాసి వాటి పైన ప్రతి పక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నారు. ప్రజల్లో రాజకీయ లబ్ది పొందడం కోసమే దిశగా ప్రవరిస్తున్నారు. ఎన్టీపీసీకి …ప్రభుత్వానికి కొంత గేప్ వచ్చింది. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయి. లేదని నేను చెప్పలేదన్నారు బొత్స.
సమస్య అయిపోయిన తరవాత కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు.సమస్యకు తగ్గ పరిస్కారం మార్గాలు అన్వేషించి పూర్తి చేస్తాం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రస్తుతం పవర్ సమస్య ఎక్కడా లేదు. కావాలంటే గ్రామాల్లో కి వెళదాం రండి. జగన్మోహన్ రెడ్డి స్వయానా చిన్నాన్న మృతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
లేని పేర్లను చేరుస్తూ ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి టీడీపీ ప్లాన్ చేస్తుందన్నారు. చెత్త పన్ను మీద కూడా పెద్ద ఎత్తున గొడవ సృష్టిస్తున్నారు. క్లీన్ ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించాం. రోజుకు రూపాయి , రెండు లు మాత్రమే వసూలు చేస్తున్నాం. కానీ కొన్ని పత్రికలు దోచుకు తింటున్నట్టు చూపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు పని చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న మేము చేస్తే కడుపు మంటా? అన్నారు బొత్స.
జగనన్న ఇళ్ల నిర్మాణాలకు మ్యానిఫెస్టోలో 5 లక్షలు ఇస్తామని మేము చెప్పలేదు. అచ్చెన్నాయుడు ఆ విషయాన్ని గుర్తించాలి. అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకుతింటున్నారు….మేము వస్తే ఇంటి స్థలం , నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పాం. అచ్చెన్నాయుడు కి సవాలు విసిరితున్నా…ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే ఆయన వెనకాతల నేను కూడా వెళ్తా. రాజకీయంలో కొన్ని మాటలు మాట్లోడొచ్చు. తప్పు లేదు కానీ ఉన్నవి లేనివి మాట్లాడితే మాత్రం వాటికి అర్ధం ఉండదు. జగనన్న ఇల్లు పిచ్చుక గూళ్ళు లాగా ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబులాగా అబద్ధపు మాటల అనను. అలా ఏమైనా అంటే నేను తల దించుకుంటా అన్నారు బొత్స.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ ఆపడొద్దని జగన్ చెప్పారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఏదోలా ముందుకు వెళ్తున్నాం. టిడ్కో ఇల్లులు కూడా అందజేస్తున్నాం. మా ప్రభుత్వం పేదల పట్ల, వారి అవసరాల పట్ల చిత్తశుద్ధితో ఉంది. మూడు , నాలుగు రోజులు బట్టి లేనిపోనివి సృష్టించి ఇస్తానుసరంగా కధనాలు రాస్తున్నారు. పి.ఆర్.సి విషయం లో ఏదో జరిగిపోతుందని ఆశించారు. ఉద్యోగులు వారి తప్పును తెలుసుసుకున్నారు. ఒక కమిటీ వేశారు. ఆ సమస్యను కూడా పరిష్కరించారు. కాటి కాడ నక్క లాగా టీడీపీ నాయకులు కాసుకు కూర్చుంతున్నారు, ఏ సమస్య వస్తే ఎలా విధ్వసం సృష్టించాలో అని ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇస్తానుసరంగా వ్యవహరిస్తే మాత్రం తగిన పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రి బొత్స.