టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో…
ఏపీలో అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. మా మంత్రి చనిపోయిన షాక్ లో మేముంటే ఆయనపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం దుర్మార్గం అన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. కరకట్ట పై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కుట్ర కోటగా మార్చాడు. అత్యున్నత సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది…దాన్ని మేము కూడా ఆహ్వానించాం. కానీ దర్యాప్తులో…
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు నెలల నుంచి లేఅవుట్ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుందని నేతలు చెబుతున్నారు. వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లేఅవుట్ స్థలాలకు నాలుగు నెలల నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఈ ఏడాది అక్టోబర్…
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం యమరంజుగా వుంటుంది. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్ధాయి అనేశారు రాజా. టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని విప్ దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో తెలుదేశం పార్టీకి తాడు…
చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన… వైసీపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని గుర్తుచేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా…
ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు…
ఆ మాజీ మంత్రి రాజకీయ దోబూచులాడుతున్నారు. పార్టీలోనే ఉంటానంటారు. హైకమాండ్ పిలిస్తే మాత్రం పలకరు. ఉనికి కోసమే అనుకుంటే.. వ్యూహాలను తెరపైకి తెస్తారు. రెండున్నరేళ్లుగా ఇదే ఆయన స్టయిల్. ఇప్పుడైనా క్లారిటీకి వస్తున్నారా అంటే వెయింట్ అండ్ సీ అంటున్నారు. ఇంతగా కన్ఫ్యూజన్లో ఉన్న ఆ నేత ఎవరు? టీడీపీ కోసం బహిరంగ వేదికలపైకి వచ్చిన సందర్భం లేదుమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే. సైకిల్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేత. అధికారంలో…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అలవాటుగా మారి మాటల దాడి చేస్తున్నారు. ఏదో విధంగా , ఏవేవో కధనాలు రాసి వాటి పైన ప్రతి పక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నారు. ప్రజల్లో రాజకీయ లబ్ది పొందడం కోసమే దిశగా ప్రవరిస్తున్నారు. ఎన్టీపీసీకి …ప్రభుత్వానికి కొంత గేప్ వచ్చింది. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయి. లేదని నేను చెప్పలేదన్నారు బొత్స. సమస్య అయిపోయిన తరవాత…