ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నేత దేవినేని చందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రోజుకో సమస్య సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఉన్నంత కాలం విద్యుత్ చార్జీ పెంచలేదని, స్లాబ్ రేట్ 1.90 పైసలు పెంచి ప్రజలపై…
ఏపీలో జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలకు సంబంధించిన సమస్యలను సరిదిద్దుతామన్నారు. మరోవైపు ఏపీలో తాజా పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. జగన్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ కూడా త్వరలో శ్రీలంకలా మారే ప్రమాదం కనిపిస్తుందన్నారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు…
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యాయానికి నాంది పలికారన్నారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పెద్ద పెద్ద సొరకాయలు కోస్తారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యింది?? కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. ఈ అంశాలు పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించటం లేదు. జనాభా పెరిగిపోతుంటే పాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు?? పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహాతో…
ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లాల ఆవిష్కరణ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. గతంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. తాజాగా 26 జిల్లాలకు పెరగనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గం అని దుయ్యబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం…
ఏపీలో అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుని బీజేపీ తప్పుపడుతూనే వుంది. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయి. అయితే ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లుకు పనులు పూర్తి చేసి ఇవ్వాలి.తగిన సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన…
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగనుదేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని, స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలను విద్యుత్ షాక్ లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని…
విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై…
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు…