తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5వరకు స్వామివారి దర్శనాలకు బ్రేక్. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలులో సీనియర్ కార్యకర్తలకు సన్మానం విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. రైవాడ జలాశయం నీటికి రాయల్టీ చెల్లింపు…
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కుంభంపాటి రాంమోహన్ రావును మంచి పదవిలో చూస్తామన్నారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల కష్టాలను పార్లమెంటులో ప్రస్తావించారన్నారు. ప్రతీ ఒక్కరికి తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉండేలా చేసింది రాంమోహన్ అని, రాంమోహన్ కు…
ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్‌కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన…
ఆ ఇద్దరు నేతలు జిల్లాలో టీడీపీకి కీలకం. కానీ.. ఒకరంటే ఒకరికి గిట్టదు. పార్టీ కష్టకాలంలో ఉన్న టైమ్‌లోనూ ఆధిపత్య పోరాటమే. బడానేతలు తెరవెనక చేస్తున్న కుట్రలతో 3 నియోజకవర్గాల్లో గ్రూపుల గోడవలు తారాస్థాయికి చేరాయి. ఆ నాయకలు ఎవరో.. ఆ నియోజకవర్గాలేంటో..ఈ స్టోరీలో చూద్దాం. మూడు నియోజకవర్గాల్లో కోల్డ్వార్శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటలు గత ఎన్నికల్లో మంచులా కరిగిపోయాయి. పది నియోజకవర్గాల్లో సైకిల్‌కు దక్కింది రెండే. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార వైసీపీదే హవా. అయినప్పటికీ…
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే…
విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్ హాట్ డిస్కషన్లు.. వాయిదాల మీద వాయిదాలతో చివరాఖరికి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. జనరంజక బడ్జెట్ తీసుకువచ్చారంటూ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని,…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వివాదం రేగుతూనే వుంది. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టాను.. అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చెప్పలేదా..? ఎన్నికల ముందు మూడు రాజధానులని ఎందుకు అనలేదు..? అధికారం ఇచ్చారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తారా..? రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే… న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా..? అన్నారు గద్దె తిరుపతిరావు. జగన్ గారూ.. ప్రజల…
ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు. మహిళలు, రైతులు 800రోజులకు పైగా ఉద్యమం చేశారు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని.. మళ్లీ వివాదం…
ఏపీకి మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని.. ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని బొత్స కామెంట్ చేశారు. దమ్ముంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పాలన్నారు. రాజధాని పరిధిలో మిగిలిన 7,300…