డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ పై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. మాజీ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారికి నచ్చడం లేదేమో..? మాజీ ఐఏఎస్ ఎస్సార్ శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలి. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ పేదలను అగర్భ శత్రువులుగా చూస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్…
నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు…
బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది. రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు…
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు మే లో హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు…
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మంనతాలు జరిపారు. అనంతరం ఆయన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల హైదరాబాద్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల అనంతరం ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణ జన్మదినం. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న చంద్రబాబు ఈ సందర్భంగా బొజ్జల ఇంటికి వెళ్లి…
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని.. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని.. దశలవారీగా ఆ పని పూర్తిచేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని… 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు. అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో త్వరగా అయిపోయే పనులు…
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం విస్తరణ వివాదాలు రేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అసంతృప్తికి లోనయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిది అదే కథ. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ షాక్ నించి బయటకు వస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, జనసేనపై కీలక కామెంట్లు చేశారు. టీడీపీని సమాధి చేద్దామని నా వెంట వస్తున్న వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. టీడీపీ హయాంలో జాకీ వెళితే.. దొంగలు పడ్డ ఆరు…
ఏపీ మంత్రివర్గ విస్తరణ విమర్శల పాలవుతోంది. ప్రతి పక్షాన్ని తిట్టేందుకేనా మంత్రులు వున్నదని తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్. ప్రజలకు పని చేయటం కోసం మంత్రి పదవులివ్వలేదన్నది కెబినెట్ చూస్తే అర్థమవుతోంది. ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కాలంటే అవినీతి, మాఫియా, భూకబ్జాలే అర్హతలు అన్నారు. Also Read: Atchannaidu: ఆక్వారంగాన్ని ఉరితీసిన జగన్ వైఎస్ కుటుంబాన్ని తిట్టిన వాళ్లకూ మంత్రివర్గంలో చోటు కల్పించారు. వైఎస్ దోపిడీని బయటపెట్టడం లేదా కలిసి దోపిడీ…
తిరుమలలో స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర ఆలోచనలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇందుకు తగ్గట్లుగానే టీటీడీ చర్యలు ఉన్నాయన్నారు. ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యాల కల్పన మీద లేదా..? మళ్లీ దర్శనం ఆలోచన కుటుంబాలకు రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రో టీటీడీ సమాధానం చెప్పాలి. స్వామివారి సేవ, భక్తుల సేవ కాకుండా ఎవరి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి దర్శనం…