టీడీపీ అధినేత చంద్రబాబుపై హోంమంత్రి తానేటి వనిత విమర్శలు చేశారు. టీడీపీకి మహిళలపై గౌరవం లేదన్నారు. అత్యాచార బాధితురాలి పరామర్శను చంద్రబాబు రాజకీయం చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లో నిందితులను పట్టుకున్నామని, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత గుర్తుచేశారు. మహిళలకు ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు తెగ ఆరోపణలు చేస్తున్నారని.. తనను ట్రోల్ చేయడం టీడీపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవమా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్…
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి…
రాష్ట్రం లో జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు మోసపోయాయన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.గుంటూరులో ఆయన మాట్లాడుతూ జగన్ మాయ మాటలకు మహిళలు, కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ దారుణంగా మోసపోయారన్నారు. ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మహిళా కమిషన్ ను అడ్డు పెట్టుకుని ప్రతి పక్ష నేత చంద్రబాబును భయపెట్టే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మాజీ…
ఏపీలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉంది. ప్రజల మద్దతు టీడీపీకి ఉంది. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ వైఫల్యం చెందారన్నారు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది.ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ…
ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు నేరుగా అందేలా చేసే ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని మాత్రమే మహిళలకు మంజూరైన పది కోట్ల రూపాయల వడ్డీ రాయితీ చెక్కును మహిళలకు అందజేశారు. మహిళా లబ్ధిదారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి…
* నేడు కరీంనగర్ కు రానున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకూ భారీ ర్యాలీ * నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్. లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు. * ఈ…
కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్…
సీఎం కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న వారి వాహనాన్ని తీసుకున్న ఘటనపై స్పందించారు ఎంపీ విజయసాయి రెడ్డి. తప్పు చేసేవారిని తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ప్రజానీకం ఉంటారు. ఎవరో ఏదో తప్పు చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే సమాజాన్నంతా నిందించడం సరికాదని హితవు పలికారు. మాజీ సీఎం చంద్రబాబుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇచ్చారని తెలుసు కానీ ఎందుకు నోటీసులు ఇచ్చారనేది పూర్తిగా…