OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
- రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆక్వా రైతుల అనుమానాలు
- సబ్సిడీ కరెంట్ ఇస్తామని మీటింగ్లో ఊదరగొట్టిన మంత్రులు
- నెల రోజులైనా సబ్సిడీ కరెంట్ ఎక్కడంటూ రైతుల ప్రశ్న
- ఫీడ్ ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందన్న ఫీలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: గోదావరి జిల్లాల ఆక్వా రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం తమను గిల్లి జోల పాడుతున్నట్టు ఫీలవుతున్నారా? ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ఆ అసహనంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోయే ఛాన్స్ ఉందా? రొయ్య రైతుల తాజా ఆలోచనలేంటి? కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాష్ట్రానికే కాదు… దేశానికే ఆదాయం తెచ్చి పెడుతున్నామంటూ నిన్న మొన్నటి వరకు మీసం మెలేసిన ఆక్వా రైతుల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. కాసుల కురిపించే ఆక్వా వ్యాపారంపై ఇపుడు ఫీడ్ అండ్ సీడ్ కంపెనీల సిండికేట్ కన్ను పడటంతో చివరికి కష్టం తప్ప కాణీ మిగలని పరిస్థితి వచ్చిందంటూ లబోదిబోమంటున్నారు రైతులు. ఈ పరిస్థితుల్లో అండగా ఉంటుందనుకున్న కూటమి ప్రభుత్వం సైతం మెల్లిగా కుచ్చు టోపీ పెడుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయట. అందుకు రకరకాల కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తున్నామంటూ ఇటీవల పాలకొల్లులో భారీ బహిరంగ సభ పెట్టి మరీ… ప్రకటించారు రాష్ట్ర మంత్రులు. ప్రకటించడమంటే అలాఇలా కాదు… మీకెందుకు, మేం ఉన్నామంటూ ఊదరగొట్టేశారు. జీవో ఇచ్చేశాం, హామీ అమలు చేస్తున్నామని చెప్పి నెల రోజులు దాటినా… ఇప్పటికీ ఏ ఒక్క రైతుకూ సబ్సిడీ కరెంటు అందకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా డెల్టా ప్రాంత ఆక్వా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు చేస్తున్న మోసాలతో ఇప్పటికే భారీగా నష్టపోయాం.. మా కష్టాలు తీర్చండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సబ్సిడీ ఇస్తున్నామంటూ ఏకంగా మంత్రులే కీలక ప్రకటన ఇచ్చి, జీవో విడుదల చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు అమలవడం లేదో అర్ధం కావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు రైతులు.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇదే సమయంలో ఫీడ్ ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం కంపెనీలను హెచ్చరిస్తున్నా లెక్కచేయక పోవడంతో… భవిష్యత్తులో ఆక్వా సాగు చేయడం అంటే కత్తి మీద సామేనని అంటున్నారు. ఫీడ్ కంపెనీలను కంట్రోల్ చేయలేకపోతున్న ప్రభుత్వం…. అది పోతేపోనీ… కనీసం కరెంటు సబ్సిడీ అయినా ఇచ్చి ఆదుకుంటుందని అనుకుంటే….ఇప్పుడు ఆ ఆశ కూడా ఆవిరయ్యేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ క్రమంలో… గోదావరి ఆక్వా ఫార్మర్స్ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఫీడ్ ధరలపై పోరాటం చేస్తున్న వాళ్ళను కొన్ని ఫీడ్ కంపెనీలు, ప్రభుత్వం తరఫున పెద్దలుగా వ్యవహరిస్తున్న కొద్దిమంది ఏరికోరి మరీ టార్గెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మేత ధరలకు సంబంధించిగానీ…, కరెంటు సబ్సిడీ విషయంలోగానీ… బహిరంగంగా నిరసన గళం వినిపిస్తే…. వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఈ విషయంలో ఇటీవల కోర్టుకు వెళ్ళిన కొంతమంది రైతులకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్న గుసగుసలున్నాయి. పైగా ఫీడ్ ధరల పెరుగుదలతో రైతులెవ్వరూ ఇబ్బంది పడడం లేదంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కొందు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
వీటన్నిటి కలగలిపి చూస్తుంటే… మమ్మల్ని గట్టెక్కించడం ఎవరివల్లకాదన్న నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారట ఆక్వా రైతులు. కేవలం ఐదారు వందల కోట్ల విలువచేసే ఫ్యాక్టరీల కోసం నాలుగు లక్షల మంది రైతుల పొట్ట కొడుతున్నారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో బలపడుతోంది. దీంతో… భవిష్యత్తు కార్యాచరణ దిశలో అక్వా రైతులు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా… గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగుపై ఆధారపడి అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. అక్కడి రాజకీయాల్లోనూ ఈ ఫీల్డ్కు సంబంధించిన వాళ్ళే కాలకంగా ఉన్నారు. ఈ క్రమంలో… కొన్ని ఫీడ్ కంపెనీలు చేస్తున్న దందాకు ప్రభుత్వ పెద్దలు వంతపాడితే భవిష్యత్తులో డ్యామేజ్ తప్పదన్నది విస్తృతాభిప్రాయం. వాళ్లు నష్టపోతున్నారు…. రైతులను ఆదుకుంటామంటూ హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలోకి తీసుకురాకపోవడం గోదావరి జిల్లాలలో రాజకీయ సమీకరణాలు మార్పునకు కూడా కారణం అవుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతుల పరిస్థితి… పోరాడితే పోయేదేముంది… అన్నట్టుగా ఉందంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!