1. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ మంగళవారం సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
2. నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు పసిడికి భిన్నంగా వెండి ధర భారీగా దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,510 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200లుగా ఉంది. అలాగే వెండి ధర రూ.600 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000గా ఉంది.
3. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే..ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభకానుంది.
4. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేడు ఐపీవోకు రానుంది. నేడు ప్రారంభం కానున్న ఈ ఐపీవో మే9న ముగియనుంది.
5. నేడు మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.